'నిన్ను వదిలి వెళ్లాలని లేదు... అని నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చకు' అని మాట తీసుకున్నావు. శాశ్వతంగా నీలోనే ఉంటానని ఒట్టేశావు. అది నిజం. జ్ఞాపకంగా, యదార్థంగా ఇప్పటికీ నన్ను కౌగిలించుకునే ఉన్నావు. ఉంటున్నావు. నమ్మకం ఓ గాఢమైన అనుభూతి మాత్రమేనా...!! ఆ రోజు వదిలి వెళ్లడానికి అంత బాధపడ్డావు. కానీ ఈ రోజు, ఈ క్షణాన ఎలా ఉన్నావో కదా...! నిన్ను నీ జ్ఞాపకాలను తలచుకుంటూ, నీ వదిలి వెళ్లిన ఏకాంతంలో... నేను...!!
నువ్వు వెళ్లేటప్పుడు ఎలా ఉందో నా గది ఇప్పటికీ అలానే ఉంది.
నామదిలా... అన్ని వస్తువులు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీవు రావని,
కుదరదని తెలిసినా...!? వెర్రిగా, పిచ్చిగా...! ఏ వస్తువును ముట్టుకోబోయినా
వాటి మీద నీ వేలి ముద్రలు నాకు నీ స్పర్శనే గుర్తుకు తెస్తున్నాయి. నీవు
వేసుకున్న షర్టు, ఇప్పటికీ హ్యాంగర్ కు వేళాడుతూనే ఉంది. నేను మాత్రం
దానిని చూసినప్పుడల్లా నీతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి హ్యాంగ్ అవుతూనే
ఉన్నాను.
అవును... నిన్ను నువ్వు
భరించలేనంతాగా నన్ను ఇష్టపడ్డావు. ప్రేమకు పిచ్చి భాషలెన్నో చెప్పావు.
ప్రేమన్నది నిర్వచనం ఇవ్వలేనిదేమో...! ప్రేమలో మునిగి ఉన్నప్పుడు వాళ్ల
వాళ్ల హృదయ సౌందర్యాన్ని కొలవడానికి ఏదైనా సాధనం ఉంటే ఎంత బావుణ్ణు...!
అప్పుడు ప్రేమకు కచ్చితమైన రంగు, రుచి ఇవ్వొచ్చు. అయినా నా పిచ్చి కాని
ప్రేమను కొలవటం ఏంటి.? అదొక ఆంతరంగిక చలనం. ఒక స్పార్క్. గుండెలో కదిలే
సుతిమెత్తని సవ్వడి. మధురమైన బాధ. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు. అవన్నీ
నేను నీ ప్రేమలో పొందాను.
'ప్రేమంటేనే శాస్వత విరహం.
ప్రేమంటేనే సుదీర్ఘ నరకం' అన్నాడు ఓ కవి. నిజమే...! అర్థమవుతోంది. ఎన్ని
కలలు, ఎన్ని కళలు, ఎన్ని కల్పనలు, ఎన్ని చేతలు, ఎన్ని రాతలు... అన్నీ అన్నీ
ఒక్క ఎడబాటుతో జ్ఞాపకాల్యయాయి. చేదు జ్ఞాపకాలయ్యాయి. ఇంతకీ ఎలా ఉన్నావు.? ఈ
క్షణంలో ఏలా ఉన్నావు.? చివరకు పడుకునే ముందైనా నేను గుర్తుకు వస్తానా...?
నా అభిమానం కాకపోతే..! నేను గుర్తు పెట్టుకున్నానని, నీవు గుర్తు
పెట్టుకోవాలను కోవడం... ప్చ్..
ప్రేమలో ఇంత తీక్షణత, కాంక్ష, వేదన
ఎలా ఉన్నాయో...! ఎప్పుడయినా కనపడక పోతావా... అని చిగురించే ఆశ. ఒకవేళ
కనపడితే నీతో ఏం మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి.? తొలి పదాన్ని ఎలా
ఉచ్ఛరించాలి.? నీ రూపం ఎలా ఉంది?. నీ మనసు ఎలా ఉంది?. ముఖ్యంగా అంత తేనేను
దాచిని నీ అధరాలు ఎలా ఉన్నాయో...! నువ్విచ్చిన తొలి ముద్దు తీయదనం నా పెదాల మీద ఇంకా ఆరలేదు. ఇప్పటికీ అలానే కదలాడుతోంది.
ఇన్ని ఆలోచనలు చేస్తున్నాను గానీ, నువ్వసలు కనపడాతావా...? ఏ దేవలోకంలో గంధర్వ కన్యగా మారి ఉంటావో కదా...! ఒక వేళ కలలో కనపడినా ఈ ప్రేమ బుజ్జి బిచ్చగాడితో మాట్లాడతావా...? అయినా స్త్రీకి, స్త్రీ ప్రేమకు లొంగే పురుషుడంటే... స్త్రీయే సర్వస్వంగా తపించే పురుషుడంటే స్త్రీకి లోకువే కదా...!?
నీ ప్రేమ కోసం ఎంత ఆరాటపడ్డాను. ఎన్ని రోజులో మూగగా రోదించాను.
కరుణించావు. కురిపించావు. వర్షించావు. చివరకు దూరమయ్యావు. అంతా ఓ
చిత్రికలా...!
అవన్నీ తలచుకుంటుంటే ఆ క్షణాలలో... నేను పొందిన ఆనందం ఎంత గొప్పదో ఇప్పుడు
తెలిసి వస్తోంది. నిజంగా ఆరాధనలో ఉండే ఉషస్సు నా హృదయాన్ని వెలిగించిన
రోజులవి. దేవతకోసం నే ఎత్తిన మంగళ హారతిలాంటివి.
ఈ ప్రపంచం నిండా ప్రేమికులే
ఉన్నారు. కానీ భయం. ప్రతి స్త్రీ, పురుషుడు తప్పక ఎవరో ఒకర్ని ఏదో ఒక క్షణం
తప్పక ఇష్టపడి ఉంటారు. వారికోసం ఒక్క నిద్రలేని రాత్రినైనా గడిపి ఉంటారు.
ఎన్ని ఏళ్లు గడిచినా ఆ మధుర ఘడియల్ని తప్పక గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
కానీ ఈ సమాజపు బురదలో పడి ఆంతరంగిక లోతుల్ని దాచేసుకుంటుంటారు. మనిషి
సంకెళ్లు విధించొచ్చుగానీ, మనసుకు సంకెళ్లు విధించలేరు కదా...! అంతా ఓ విచిత్రమైన మనో చర్య. వారిని వారు మోసంతో నటించే నటనా ప్రక్రియ.. ఓహ్..!! ఏం ఈ జీవన సంతోషం.!
రోజులన్నీ ఖాళీగా కదులుతున్నాయి. కఠినంగా నన్ను, నా జీవితాన్ని శాసిస్తున్నాయి. నీకు నిజం చెప్పనా...!
నీవు దూరమైన రోజునుంచి ఇప్పటి వరకు నేను బతికిన క్షణం ఒక్కటీ లేదు. బతకడం
అంటే ఒక పరిమళ భరితమైన ఆనందాన్ని, ఉవ్వెత్తున ఎగసే సౌందర్యాన్ని అనుభూతి
చెందడం. కానీ ఈ మనుషులకు ప్రేమంటే తెలీక. బతకడం అంటే తెలీక... డబ్బు,
ఆస్తి, హోదా అని బతికేస్తుంటారు. నవ్వు వస్తుంది కదూ...!!
మళ్లా నేను నేనుగా బతకాలన్న కోరిక చచ్చిపోయింది. చిగురించని ఆశతో ఎలానో ఒకలా... బహుశా ఇలానే నేమో...
లేకుండా ఉండనా...
No comments:
Post a Comment