అసలు ప్రేమలో ఫెయిలు, పాస్ లు ఉండవు. మనం ప్రేమించడం, ప్రేమించక పోవడం మాత్రమే ఉంటుంది. మనం ఇష్టపడ్డామని అవతలి వాళ్లు మనల్ని ఇష్టపడాలన్న రూల్ లేదుకదా... అయినా ఎదుటి వాళ్లు పుట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితుల్లోంచే... వాళ్ల అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటికి అనుగుణంగా మనం ఉన్నామా, లేమా అని అంచనా వేస్తారు.
మన
మనసుకు నచ్చిన విషయాలలోంచే ఎదుటి వాళ్లను చూస్తాం. దగ్గరగా ఉంటే ఓకె
అనుకుంటాం. ప్రపోజ్ చేసిన వారికి ఓకె చెప్తాం. లేదా అలాంటి వాళ్లు తారస
పడితే మనం ప్రపోజ్ చేస్తాం. అసలు ప్రపంచంలో 99 పర్సంట్ లవ్ లు ఫెయిలవుతాయి.
1 పర్సంటే పాస్. బాగా చదివి యక్జామ్ రాయడం వరకే మనం చేసేది. మనం కరెక్టుగా
ఉన్నామా లేదా... అనేదే చూసుకోవాలి. ఫెయల్ అయ్యామనుకో... అది ఎదుటి వాళ్ల
తప్పు. మరో సారి, మరో ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి. అంతే...
అసలు
ప్రేమంటే... ఇది అని ఎవరూ చెప్పలేరు. అది మనసులోతుల్లోంచి అనుభవంలోకి వచ్చే
అనుభూతి మాత్రమే... అది కలగా మిగలకుండా, కథగా కాకుండా జీవితాంతం సాగాలని
కోరుకుంటారు. కానీ సమాజం కల్పించిన ధనం, మతం, కులం, ప్రాంతం ఇలా... అనేక
అడ్డంకులతో ఆగిపోతుంది. మరో వైపు జీవితాన్ని లాగేసుకుంటుంది.
అయితే ఈ మధ్య ఎక్కువమంది లవ్ ఫెయిల్యూర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం
చూస్తున్నాం. వాళ్లలో ఎక్కువ మంది 15 నుండి 30 మధ్య వయసు వాళ్లే...
ప్రేమ ఓ సుందర స్వప్నం కావచ్చు. ప్రేమ ఓ అద్భుత ఛేతన కావచ్చు. ప్రేమ అనుభవంలోని ఓ తీయని జ్ఞాపకం కావచ్చు. కానీ అన్నిటికీ మించినది జీవితం. జీవితంలో ప్రేమ ఓ భాగం. ఓ చిన్న వీచిక. ఓ అలమ మాత్రమే.
ప్రేమ ఓ సుందర స్వప్నం కావచ్చు. ప్రేమ ఓ అద్భుత ఛేతన కావచ్చు. ప్రేమ అనుభవంలోని ఓ తీయని జ్ఞాపకం కావచ్చు. కానీ అన్నిటికీ మించినది జీవితం. జీవితంలో ప్రేమ ఓ భాగం. ఓ చిన్న వీచిక. ఓ అలమ మాత్రమే.
ప్రేమ సక్సెస్ కావాలను కోవడం మంచిదే... అలానే కాకుండా ఉండటం కూడా ఇంకా మంచిది.
ప్రేమ విఫలమైతే అది మన తప్పు కాదు. ఎదుటి వాళ్లు మనల్ని అర్థం చేసుకోకపోతే అది వాళ్ల దురదృష్టం. అలాగని మనల్ని, మన జీవితాల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. వాళ్లు మన జీవితంలోకి రాకముందు చాలా జీవితం మనకుంది. అలానే వాళ్లు లేని ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఒక రైలు మిస్ అయితే మరో రైలులో వెళ్తాం. అంతేకానీ జీవిత ప్రయాణాన్ని ఆపుకోం కదా...ఆపుకోకూడదు.

1.
ప్రేమించినోళ్లు... నో అని చెప్పిన వెంటనే... అది మనలో మనం దాచుకోకూడదు.
మన మనసుకు దగ్గరైన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు వెెంటనే వాళ్ల ఓదార్పు
దొరకి మనకు కొంత ప్రశాంతత, ఓరట కలిగిస్తుంది.
2. దగ్గరున్న వాళ్లతో ఓ చిన్న పార్టీ చేసుకోవాలి. ఆనందం అంటే వాళ్లతోనే కాదు, ఇతరులతో కూడా పంచుకోవచ్చు అని తెలుస్తుంది. అప్పుడు అనేక మంది... వాళ్ల లైఫ్ లోని అనుభవాలు మనతో పంచుకోవటం వల్ల మనలాంటి వాళ్లు చాలామంది ఉన్నారన్నది మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
3. వెంటనే వాళ్లని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అందుకు మన టేస్టులను, అభిరుచుల్ని గుర్తు చేసుకొని.. ఉదాహరణకు నేచర్ ను ఎంజాయ్ చేయడం, పుస్తకాలు చదవడం, మనకున్న ఆర్ట్స్ కు దగ్గరవడం ఇలా...
4. ఇంతకు ముందు మనకు దగ్గరగా ఉన్న వాళ్లని బాగా గుర్తు చేసుకొని వాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. లేదా వీలైతే పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు గడపాలి.
5. వాళ్లుమనకు పరిచయం కాకముందు మనకున్న తీయటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాలి.

6. వాళ్ల జ్ఞాపకాలను గుర్తుచేసే వస్తువుల్ని, గిఫ్టులను దూరంగా ఉంటాలి. అలానే ఫోన్ నెంబర్ లాంటివి డిలిట్ చేయాలి.
వీటితో పాటు మనకేం తక్కువ... అనే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ప్రపంచంలో
ఒక్కరే కాదు. అంతకంటే మంచి వాళ్లు మన లైఫ్ లోకి వస్తారన్నా ఆలోచనను
పెంచుకోవాలి. అసలు మనకు ఎదుటి వాళ్లు సరైన వాళ్లు కాదేమో... దూరమవడం మన
మంచికే అనే తత్వాన్ని పెంచుకోవాలి. అదే నిజం కూడా... నాకేం తక్కువ అనే
ఆత్మాభిమాన్ని పెంచుకోవాలి.
అన్నిటిని మించి ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లైఫ్ లో బాగా ఎదిగి మనమేంటో
రుజువు చేసుకోవాలి. మనకు ఎందుకు దూరమయ్యానా, అనేలా వాళ్లు ఆలోచించుకునేవా
జీవించాలి. అలాంటి జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆదిశగా జీవితాన్ని
నడిపించాలి. చరిత్రలో మనకూ ఓ పేజీ ఉందని రుజువు చేసుకోవాలి. ... ఇలాంటి
భావాలతో అనునిత్యం జీవితాన్ని ఉత్సాహం వైపు నడపాలి. ఆచరణలో పెట్టాలి.
పూర్చి పాజిటివ్ థాంట్స్ తో మైండ్ నిండిపోవాలి. మనల్ని మనం గులాబివనంలా
మార్చేకుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో దేవదాసులు, పార్వతలు లాంటి జరగని కథలు
కాదు కావల్సింది. ప్రతి మనిషి జీవితంలో ఓకే ప్రేమ ఉండదు. కొన్ని ప్రేమలు
ఉంటాయి. ఇదో అనుభవ సత్యం. ఇది కాకపోతే మరోటి. అది కాకపోతే మరోటి. కానీ మన లైఫ్ మనకు సత్యం.
ఆల్ దబెస్ట్ లవ్ ఫెయిల్యూర్స్...
ప్రపంచం మనదే...
ప్రపంచం నిండా మనమే...
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం...
పెయల్ లో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేద్దాం.
జీవితంలో మనమేంటే నిరూపించుకుందాం...
మన లక్ష్యాలవైపు సాగిపోదాం...
ప్యూచర్ మనదే...
మనల్ని కాదన్న వాళ్లు ఈర్ష్య పడేలా ఎదుగుదాం...

జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభిద్దాం
బై
మైడియర్ లవ్ ఫెయిల్యూర్స్
మైడియర్ లవ్ ఫెయిల్యూర్స్
No comments:
Post a Comment